వణికిస్తోన్న చ‌లి.. ప‌డిపోతున్న ఉష్ణోగ్రతలు…

-

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచనతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక , తమిళనాడు, కేరళ రాష్ట్రాలనూ పొగమంచు కమ్మేస్తోందని, వాహనదారులు, ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు సాగించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచన చేసింది. నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడన ద్రోణి తొలగిపోయిందని, ఈ కారణంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

కాగా, గత రాత్రి ఆదిలాబాద్ లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైతే. తెలంగాణ ముఖ్య పట్టణాలైన హైదరాబాద్, వరంగల్ అలాగే ఆంధ్ర ముఖ్య పట్టణాలైన గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపారు. ఇక ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని.. పలు చోట్ల ఆముదం పంట దెబ్బతిందని.. చలి తీవ్రతకు పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news