ఏపీ లోని విశాఖ పట్నం జిల్లా లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లాలోని వాహనాల పై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పిల్లర్లు కూలిపోయాయి. అనకాపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో రెండు కార్లు, ఓ లారీ ధ్వంసం కాగా… మరో ఇద్దరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
హైవే విస్తరణ కోసం బ్రిడ్జ్ పిల్లర్లు నిర్మిస్తున్నారు. దురదృష్ట్యావశాత్తుగా… బ్రిడ్జ్ పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో పరుగులు తీశారు స్థానికులు. అలాగే ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. సైడ్ పిల్లర్లు కిందపడి కారు, ట్యాంకర్ నుజ్జు నుజ్జు అయింది. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటన చోట సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.