ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు!

నిరుద్యోగులకు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ Indian Coast Guard శుభవార్త తెలిపింది. తాజాగా ఈ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌/ Indian Coast Guard

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

కోస్ట్‌ గార్డ్‌లో నావిక్‌ (జనరల్‌), నావిక్‌ (డొమెస్టిక్‌ ), యాంత్రిక్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 జూలై 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను https://joinindiancoastguard.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌ లై న్‌ లోనే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలు తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీల సంఖ్య– 350
నావిక్‌– 260, నావిక్‌ (డొమెస్టిక్‌)– 50,యాంత్రిక్‌ (మెకానికల్‌)– 20, యాంత్రిక్‌ (ఎలక్ట్రికల్‌)– 13,యాంత్రిక్‌ (ఎలక్ట్రానిక్స్‌)– 13

దరఖాస్తు విధానం..

అప్లికేషన్‌ ప్రక్రియ జూౖల2 నుంచి మొదలైంది. చివరి తేదీ 2021 జూలై 6 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు

నావిక్‌ జనరల్‌ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్‌ కావాలి. నావిక్‌ డొమెస్టిక్‌ పోస్టులకు పదవ తరగతి పాస్‌ కావాలి. యాంత్రిక్‌ పోస్టులకు ఎలక్ట్రికల్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్‌ (రేడియో, పవర్‌) ఇంజిజనీరింగ్‌లో 3 లేదా 4 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 –22 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
అభ్యర్థులకు నాలుగు దశల్లో పరీక్షలు ఉంటాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విధంగా పరీక్షలు నిర్వహిస్తారు.