రేపటి నుంచి తెలంగాణలో కాలేజీలు ప్రారంభం… ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

-

తెలంగాణలో రేపటి నుంచి అన్ని కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుండి జూనియర్ కళాశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కళాశాలలకు వచ్చే సిబ్బంది కచ్చితంగా కరోనా నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు డేట్స్ ని రివైజ్ చేసింది ఇంటర్ బోర్డు. ఈ నెల 30 లోపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని.. నిబంధనల్లోనూ సడలింపులు ఉంటాయని కూడా స్పష్టం చేసింది.

పెంచిన అఫిలియేషన్ ఫీ, ఉపసంహరణ పాత ఫీనే కొనసాగింపు ఉంటుందని పేర్కొంది. 15 మీటర్ ల కన్నా ఎత్తు తక్కువ ఉన్న కళాశాల భవనాలకు ఆటో రెన్యూవల్ చేయాలని బోర్డు తెలిపింది. 15 మీటర్ ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో కళాశాల ఉంటే విపత్తు నిర్వహణ, అగ్నిమాపక విభాగం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని వెల్లడించింది ఇంటర్ బోర్డు. సెప్టెంబర్ 30 లోపు సానిటరీ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ సౌండ్ నెస్ సర్టిఫికెట్స్ స్టాఫ్ డీటెయిల్స్ సమర్పించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news