బుల్‌ఫైట్ స్టేడియంలో దారుణం.. స్టాండ్ కూలి ఆరుగురు మృతి.. 500 మందికి పైగా!

కొలంబోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుల్‌ఫైట్ స్టేడియంలో ఆరుగురు మృతి చెందగా.. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

బుల్ ఫైట్-కూలిన స్టేడియం
బుల్ ఫైట్-కూలిన స్టేడియం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్‌ఫైట్ జరుగుతుండగా స్టేడియం స్టాండ్ కుప్పకూలిందన్నారు. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా అలజడి రేగిందన్నారు. భయంతో ప్రేక్షకులు పరుగులు తీశారన్నారు. కుటుంబాలతో స్టేడియానికి వచ్చిన వారందరూ చెల్లాచెదురయ్యారని అన్నారు.

బోగోటాకు 100 మైళ్ల దూరంలో ఉన్న కొలంబియాలోని ఎల్ ఎస్పినల్‌లోని స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. సహాయ చర్యలు చేపట్టామని, శిథిలాలను తొలగించామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.