దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వస్తోన్న నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇకపై విదేశాల నుంచి టీవీలను దిగుమతి చేసుకోవాలంటే కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని DGFT నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని తెరలు కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్‌సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. దీంతో రానున్న రోజుల్లో కలర్ టీవీల ధరలు భారీగా పెరిగే అవకాశముంది.