సాధారణంగా మనకు బర్గర్లు రక రకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్నాయి. కొందరు నాన్ వెజ్ బర్గర్లను ఇష్టంగా తింటారు. కొందరు కేవలం వెజ్ బర్గర్లకే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఇవి రెండూ కాదు, ఏకంగా అక్కడ గోల్డ్ ప్లేటెడ్ బర్గర్లను విక్రయిస్తున్నారు. అవును.. కొలంబియాలోని బొగొటా అనే ప్రాంతంలో ఉన్న ఓరో మెక్ కాయ్ అనే రెస్టారెంట్ వారు బంగారు బర్గర్లను విక్రయిస్తున్నారు.
అయితే బంగారు బర్గర్లు అన్నాం కదా అని చెప్పి వాటిలో బంగారం ఉండదు. కేవలం బంగారం ఫాయిల్‌ను పై పూతగా వేసి అందిస్తారు, అంతే.. ఇక అందుకు గాను వారు 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. కాగా ఆ బర్గర్ ధర 59 డాలర్లు. అంటే సుమారుగా రూ.4,300 అన్నమాట. అదే కొలంబియన్ పెసోలలో అయితే ఆ బర్గర్ ధర ఏకంగా 2 లక్షల పెసోలు. ఆ రెస్టారెంట్లో సాధారణ బర్గర్ ఖరీదు 11 డాలర్లు (దాదాపుగా రూ.800) ఉంటుంది. కానీ అది గోల్డ్ ప్లేటెడ్ బర్గర్ కనుక దానికి ఆ ధరను నిర్ణయించారు.
View this post on Instagram
అయితే బంగారు బర్గర్‌ను తయారు చేశాక దాన్ని సేల్ కు పెట్టి ఆ రెస్టారెంట్ వారు దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటికే దానికి 1 లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ చేస్తున్నారు. తాము కూడా ఆ బర్గర్‌ను తినాలని ఆసక్తిని చూపిస్తున్నామని తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో రెస్టారెంట్‌కు కస్టమర్లు పెద్దగా రాక అమ్మకాలు పడిపోయాయని, అందుకనే ఈ వెరైటీ ప్రయోగం చేశామని నిర్వాహకులు తెలిపారు.