నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రూలర్ సినిమాతో షాక్ తగలడంతో బాలయ్యకి ఇప్పుడు హిట్ అత్యవసరంగా మారింది. ఈ నేపధ్యంలోనే ఆయన తనకు రెండు హిట్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్దమయ్యారు. ఈ సినిమా ఇప్పటికే లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను చిత్ర యూనిట్ సిద్దమైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన గుండులో కనపడుతున్నారు. దీనితో ఈ సినిమాలో బాలకృష్ణ గుండుతో రాజకీయ నాయకుడిగా నటించే అవకాశం ఉందని విలన్ గా మరో హీరో శ్రీకాంత్ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
శ్రీకాంత్ పాత్రలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరో విలన్ గా హాస్యనటుడు సునీల్ కూడా నటించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ సినిమా కోసం సునీల్ ని ఇప్పటికే సంప్రదించగా అందుకు సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. త్వరలోనే ఈ సినిమాలో సునీల్ పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలవుతున్నట్టు తెలుస్తుంది.