నిన్న ఉదయం తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన కమెడియన్ మనోబాల లివర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడని తెలిసిందే. ఈయన మృతి పట్ల అటు తమిళ్ మరియు తెలుగు సినిమా వర్గాలవారు బాధపడ్డారు. ఇతను తనదైన కామెడీ టైమింగ్ తో ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నాడు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈయన మృతికి అసలు కారణం ఏమిటో తెలిసింది. ఈయన సగటున ఒక రోజుకి దాదాపుగా 100 సిగరెట్లు కాల్చేవాడని సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ స్థాయిలో సిగరెట్లు తాగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిసి కూడా దానికి బానిసై లివర్ బాగా చెడిపోయి ఆఖరికి ప్రాణాలనే కోల్పోయాడు.
ఈ విషయాన్నీ హాస్పిటల్ వర్గాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాబట్టి అందరూ కూడా ధూమపానం మరియు మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండండి.