ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుందిన భామ కుష్బూ. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈమె కన్నడ మలయాళం హిందీ చిత్రాల్లో సైతం మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని చిత్రాల్లో నటిస్తూ వస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించిన కుష్బూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నారు. తాజాగా ఈమె నటించిన రామబాణం చిత్రం మే 5 న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ మెగాస్టార్ చిరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
ఈ నేపథ్యంలో.. “చిరు నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది.. ఆయన ఓ లెజెండ్. మానవత్వం కలిగిన వ్యాక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం చిరంజీవిది అన్నారు. అంతే కాదు చేసే పని మీద ప్యాషన్ కూడా ఆయనకు ఎక్కువగా ఉంటుంది.. అంతే కాదు ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. అంతే కాదు నేను మెగాస్టార్ ను కదా.. ఏం చేసినా.. జనాలు చూస్తారు లే అని ఆయన అనుకోరు.. కొత్తగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటివరకు పూర్తి కాని, నా కల ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి గారితో రొమాన్స్ చేయలేకపోవటమే. స్టాలిన్‌లో ఆయనతో కలిసి నటించాను. కాని ఆ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి రీసెంట్ గా ఓ కమర్షియల్ యాడ్ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా.. మెచ్యూర్ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల..” అంటూ తెలిపారు కుష్బూ.