వివాదంలో “కమిట్ మెంట్” మూవీ..క్షమాపణలు చెప్పిన దర్శకుడు

-

“కమిట్ మెంట్” మూవీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పారు ఈ మూవీ దర్శకుడు. నన్ను క్షమించండంటూ ఓ వీడియో విడుదల చేశారు కమిట్ మెంట్ మూవీ డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్న. రీసెంట్ గా మా సినిమా ప్రోమో లో భగవత్ గీత వాడడం వెనుక నేను సెన్సేషన్ కోసమో వ్యూస్ కోసమో కాదని.. నేను కానీ మా టీమ్ కానీ నిర్మాతలు కానీ రిలీజ్ చెయ్యలేదని వెల్లడించారు.

నా కథ తాలూకా ఆత్మ ఆ శ్లోకం లో ప్రతిబింబిస్తుంది అని నాకు నేను ప్రోమో చేసుకొని మా టీమ్ సభ్యులకు పంపించానని తెలిపారు. వాళ్ళు ఎగ్జైట్ అయ్యి వాళ్లకు వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల ఆ వీడియో వైరల్ అయ్యిందని.. హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు నన్ను క్షమించండని వేడుకున్నారు. హిందూ మతం నాకు తల్లి వంటిది హిందూ మతాన్ని కించపరిస్తే నా తల్లిని కించ పరుచు కున్నట్టేనని.. దయచేసి ఆ వీడియో వున్న వాళ్ళందరూ డెలీట్ చెయ్యండి ఇది నా రిక్వెస్ట్ అని ప్రధేయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news