చంద్రబాబుపై సామాన్యుడు సంధిస్తున్న ప్రశ్నలు!

-

పరిస్థితులు, పత్రికలు, మీడియా సంస్థలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు… ఇవేవీ ఇంతకాలం కాపాడలేకపోయినా.. కరోనా అయినా తనను కాపాడుతుందేమో అనే భ్రమలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నట్లున్నారు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం… ప్రతిపక్ష నేత అంటే, కేవలం అధికారపక్షంపై విమర్శలు చేయడమే తప్ప మరొకటి కాదని గ్రహించినట్లుగా ఆయన ప్రవర్తన ఉండటమే! ఆ ప్రవర్తన్లు ఏమిటి.. ఆ విమర్శలు ఏమిటి.. వీటిమధ్య సామాన్యుడు చంద్రబాబుపై సంధిస్తున్న ప్రశ్నలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం!


గత కొన్ని రోజులుగా ప్రజల ఆరోగ్యం, కరోనా వంక పెట్టి చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేస్తున్న విమర్శల్లో మొదటిది… స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ దృష్టి పెడుతుందని! ఈ సమయంలో… జనాలకు ఏమీ గుర్తులేదని భావిస్తున్న విషయం ఏమిటంటే…. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు హయాంలో గత రెండేళ్ల క్రితమే జరగాల్సినవి! అయితే… నాటి పరిస్థితుల నేపథ్యంలో ఓటమి భయంతో వాటిని వాయిదా వేశారు! ఈ విషయం జనాలు మరిచారని భావించిన చంద్రబాబు… స్థానిక సంస్థల భయం ఇంకా పోకో ఏమో కానీ… ఇదే విమర్శల పనిలో ఉన్నారు! ఇంతకూ… అసలు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం ఏమి ఏర్పాట్లు చేస్తుంది చంద్రబాబు?

ఇక రెండో సంగతి… ప్ర‌తి కుటుంబానికి రూ.5 వేలు అంద‌జేయాల‌ని బాబు ప‌దేప‌దే డిమాండ్ చేయడం. రాష్ట్రం విడిపోయిన అనంతరం మొట్ట మొద‌టి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబుకు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏపాటిదో తెలియంది కాదు. అన్నీ తెలిసి కూడా ఇలా రూ. ఐదువేలు డిమాండ్ చేయడం ఏమిటో ఆయనకే తెలియాలి. పోనీ.. ఈ విషయంలో బాబు నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా ఈ పరిస్థితుల్లో అంటే… ఆయన ఒక రూ. 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చి సైలంట్ అయిపోయారే తప్ప… అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నే ఆ ప్రాంత రైతుల ఉద్య‌మానికి ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు ఊరూరూ తిరిగి విరాళాలు సేక‌రించినట్లుగా ఇప్పుడు ఏపీకి విరాళాలు ఇచ్చి ఆదుకోవాల‌నే పిలుపు ఎందుకివ్వ‌లేదో ఆయనే తెలియాలి. రాజధానిపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై ఎందుకు లేదు చంద్రబాబు?

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో… రాష్ట్రం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది… ఈ సమయంలో రుణమాఫీలు కష్టం, ఇంటికో ఉద్యోగం ప్రశ్నేలేదు, కారొపొరేషన్ లోన్ లు అంతంత మాత్రం, కేవలం రాజధాని అంశం తప్ప మరో టాపిక్ కి డబ్బులే లేవు, పబ్లిసిటీకే తన ప్రథమ ప్రాధాన్యం అన్నట్లుగా పరిపాలన సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు రూ. 3 లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని ఏపీపై మోపిన క్రెడిట్ కూడా బాబు సొంతమే! ఈ పరిస్థితుల్లో అయ్యిందేదో అయ్యింది… జగన్ ఏదో నెట్టుకొస్తున్నాడులే అనుకోకపోయినా పర్లేదు కానీ… రూ. ఐదువేలు ఇవ్వమని అడుగుతున్న ఈ పెద్దమనిషి… కనీసం రాష్ట్రానికి సాయం చేయమని (సెంట్రల్ లో చక్రం తిప్పాను అని చెప్పుకునేవారు కాబట్టి) మోడీని అడగలేరా? ఆ మనసు, ఆ ఆలోచనా లేదా చంద్రబాబు?

Read more RELATED
Recommended to you

Latest news