చైనా కంటే స్పీడ్ గా తెలంగాణా ఆస్పత్రి…

-

తెలంగాణాలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సర్కార్ దూకుడుగా నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనితో తెలంగాణాలో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో హైదరాబాద్ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని తెలంగాణా సర్కార్ ఏర్పాటు చేసింది. చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రిని కట్టగా…

తెలంగాణా 20 రోజుల్లోపే… దాని కంటే పెద్ద ఆస్పత్రిని సిద్దం చేసింది. 1500 పడకల ఆస్పత్రిని సిద్దంగా ఉంచింది. ఇది నేడే ప్రారంభం చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చింది రాష్ట్ర సర్కార్. 15 అంతస్తులు ఉన్న ఈ కాంప్లెక్స్ ని ఆస్పత్రిగా మార్చడానికి యుద్ద ప్రాతిపదికన తెలంగాణ సర్కార్ పని చేసింది. ఫర్నిచర్, మెడికల్ కిట్స్‌ అన్నీ రెడీగా ఉంచారు.

15వ తేదీ నుంచే ఇది సిద్దంగా ఉంటుందని భావించినా… నేడు ప్రారంభిస్తారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రిలో 468 గదుల్లో 50 పడకల ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ఒక్కో అంతస్తులో 36 గదులు, ఒక్కో గదిలో 23 పడకలు ఉండగా దీన్ని పూర్తిగా కరోనా ఆస్పత్రిగానే వాడతారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్‌ను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ గా దీన్ని మార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news