2023 లో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే మా విజన్ అని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. ప్రతి పదేళ్ల కు ఓ సారి ప్రభుత్వం మారుతుందని, 2023 ఎన్నికలు కాంగ్రెస్ కి మైలు రాయి లాంటివని అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుతే తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న ఆయన కరెక్ట్ స్టెప్స్ వేసుకుంటూ… అధికారం కోసం అడుగులు వేస్తూ పోతామని అన్నారు. గవర్నర్ అపోయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్న ఆయన తనకు తెలంగాణ కొత్త అని అన్నారు. నాయకుల మధ్య యూనిటీ ఉండాలి అనేది ప్రధాన అంశమన్న ఆయన ఇక్కడి నాయకుల మధ్య యూనిటీ లేదని కాదని అన్నారు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా అభ్యర్థుల ఎంపిక చేయలేమని, రేపు ఢిల్లీకి వెళ్తున్నా… సోనియా..రాహుల్ ని కలిసే ప్రయత్నం చేస్తానని అన్నారు.
ముందుగా అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యం కాదు.. గెలుపు ముఖ్యమని ఆయన అన్నారు. కోదండరామ్ కి మద్దతు పై సబ్ కమిటీ వేస్తామని, ఫ్రెండ్లీ పార్టీతో మేము సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నామని అన్నారు. పీసీసీ మార్పు పై నేను ఏం మాట్లాడనన్న ఆయన అయినా పీసీసీ మార్పు పార్టీ అంతర్గత అంశమని అన్నారు. పీసీసీ మార్పు అనేది ఏఐసీసీ అధ్యక్షురాలు పరిధిలోని అంశమని అన్నారు. తెలంగాణ… తమిళనాడు ప్రజలు ఏమోషన్ పీపుల్ అన్న ఆయన ఇక యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు.. ఇక్కడి ఎన్నికలకు పోల్చలేమని, అక్కడి మోడల్ ఇక్కడ వర్కౌట్ కాదని అన్నారు. ఏడాది లో తెలుగు నేర్చుకుంటానన్న ఆయన ప్రస్తుతానికి అయితే వీళ్లంతా నాతో ఇంగ్లీష్ లొనే మాట్లాడుతున్నారని అన్నారు.