టచ్‌లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అయినా ఆ చెత్త మా కొద్దు

-

ఆప్ పంజాబ్ యూనిట్‌తో టచ్‌‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన పెద్దపాటిగా నవ్వేశారు. వచ్చే ఏడాది మార్చిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. కానీ, ఆ పార్టీ చెత్త మాకు అవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ చెత్తను తీసుకోవాలని మేం అనుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు హస్తం పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఆప్‌లో చేరిపోతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

పంజాబ్ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థి అనే విషయాన్ని వెల్లడించలేదు. కానీ, తాను మాత్రం పంజాబ్ సీఎం అభ్యర్థిని మాత్రం కానని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్‌పై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్ రాష్ట్ర ఖజనా ఖాళీ అయ్యిందని ప్రస్తుత ప్రభుత్వం ఏడుస్తుంది. కానీ, రాష్ట్ర ఖజానాను ఎవరు ఖాళీ చేశారు. గత 15ఏండ్లుగా ఎవరు అధికారంలో ఉన్నారు? రాష్ట్ర ఖజానాను ఎలా నింపాలో కేజ్రీవాల్‌కు తెలుసు అని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version