కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి పెడుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 124 మందితో కూడిన పేర్లను విడుదల చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకాపుర ప్రాంతం నుంచి బరిలో దిగనున్నారు. వీరితో పాటు పలువురు కీలక నేతల పేర్లను పార్టీ ప్రకటించింది.

మార్చి 17నే తొలి జాబితాలోని పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైనల్ చేసింది. దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి.. పేర్లపై చర్చించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి రాహుల్ గాంధీ సహా పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. కర్ణాటక అసెంబ్లీ గడువు మే నెలతో ముగియనుంది. ఆ లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి.

2018లో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఆ కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news