ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష… రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీకే కాకుండా దేశవ్యాప్తం ఉన్న కాంగ్రెస్ అభిమానులకు, కార్యకర్తలకు తీవ్ర నిరాశను కలుగచేశాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా దారుణంగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి కనీస పోటీ కూడా ఇవ్వకుండా చతికిలపడింది. ఉత్తర్ ప్రదేశ్ లో 403 స్థానాల్లో పోటీ చేసి కేవలం 1 స్థానానికి పరిమితం అవ్వడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ప్రియాంకగాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్ని హామీలు ఇచ్చినా.. జనాలు నమ్మలేదు. ఈ పరిస్థితుల్లో గులామ్ నబీ ఆజాద్ వంటి కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంత్రుప్తి వెల్లగక్కారు. 

ఓటమిపై సమీక్షించేందుకు రేపు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. పార్టీ ప్రక్షాళన, నాయకత్వ మార్పుపై పార్టీ చర్చించే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోవడంపై ప్రత్యేకంగా చర్చ జరుగనుంది. పంజాబ్ రాష్ట్రంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దారుణంగా ఓడిపోవడంపై చర్చించే అవకాశం ఉంది. పంజాబ్ లో సీఎం చన్నీతో సహా పీసీసీ అధ్యక్షుడు సిద్దూ కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో జీ 23గా పిలువబడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకలు కూడా రేపటి సమావేశానికి హాజరు అవుతారని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలపై చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీ అధినాయకత్వాన్ని అప్పగించాలనే చర్చ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news