ఈటెల రాజేంద్ర రెడ్డి… బీసీ కాదా…?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయనపై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈటెల రాజేందర్ బీసీ కాదు.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడుకు పేరు మీద ఉన్న వందల కోట్ల భూ రికార్డుల్లో ఈటెల రెడ్డి గా ఉన్నారు అని వ్యాఖ్యలు చేసారు. నితిన్ రెడ్డి తండ్రి రాజేందర్ రెడ్డిగా పేర్కొన్నారు అని అన్నారు.

ఈటెల రాజేందర్ కు వందల కోట్ల డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించారు. గుడ్లు పెట్టని కోళ్ళకు కోట్లు ఎందుకు పెట్టినట్టు అని నిలదీశారు. హుజురాబాద్ లో రాజీనామా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ కు భయం అవుతోందా అని నిలదీశారు. ఈటెల భయపడి పారిపోయారు అని మండిపడ్డారు.