యాక్సిడెంట్ : ఆర్టీసీ డ్రైవర్ ను చితబాదిన జనాలు

ఈరోజులలో రోడ్డు ఎక్కితే మళ్ళీ సేఫ్ గా ఇంటికి వస్తామో రామో తెలియని పరిస్థితి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదురు వచ్చే వాడు జాగ్రత్తగా వస్తాడన్న నమ్మకం లేదు. ఒక్కోసారి ఎదుటి వాడు మనని గుద్దేసినా మనది పెద్ద వాహనం అయితే మనదే తప్పు అన్నట్టు ప్రవర్తిస్తారు చుట్టుపక్కల వాళ్ళు ఈరోజు అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ను జనాలు చితబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డిలోని మెయిన్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ ను కరీంనగర్ డిపో 1 కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఎక్సెల్ పై ప్రయాణిస్తున్న పసుల పోశయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.ఆర్టీసీ డ్రైవర్ మల్లయ్య నిర్లక్ష్యమే కారణం అంటూ డ్రైవర్ ను స్థానికులు తీవ్రంగా చితకబాదారు. డ్రైవర్ సీట్లో నుంచి కిందకు లాక్కొచ్చి మరీ క్షతగాత్రుని బంధువులు, స్థానికులు చితక కొట్టారు. దీంతో డ్రైవర్ కు సైతం గాయాలు అయ్యాయి. అయితే తన తప్పు ఏమీ లేదని సదరు ఆర్టీసీ డ్రైవర్ అంటున్నారు.