వరి కొనక పోతే.. కెసిఆర్ ను ఉరి తీసినా తప్పు లేదు : కోమటిరెడ్డి

తెలంగాణ సిఎం కెసిఆర్ పై కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే.. ఈ అసమర్థ సీఎం కెసిఆర్ ఉరేసినా తప్పు లేదని ఫైర్ అయ్యారు. వరి వేసుకుంటే ఉరి కాదు… నిన్ను ..నీ ప్రభుత్వాన్ని ప్రజలు ఉరి వేస్తారని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీ ఆదరించండని కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఎం కెసిఆర్ కి మానవత్వం లేదు… ఆయన పని ఐపోయిందన్నారు.

komatireddy venkatreddy

మద్య మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినా కలిసి పని చేస్తామని..కాంగ్రెస్ లో అందరం పెద్ద నాయకులమేనని చెప్పారు. అందరం పిసిసి అధ్యక్షులమేనని.. అందరం కార్యకర్తలమే అని పేర్కొన్నారు. లాస్ట్ ఎన్నికల్లో చాలా పొరపాట్లు జరిగాయి.. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగవన్నారు. మీరు..మేము..కెసిఆర్ పోతాడు కానీ.. కాంగ్రెస్ ఎటు పోదని పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కెసిఆర్ సంపాదన లో 20 వేల కోట్లు ఇస్తే వడ్లు కొనోచ్చని.. నిజాం రాజు కంటే ఎక్కువ సంపాదన చేశారని నిప్పులు చెరిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా రక్తం లోనే కాంగ్రెస్ ఉందని.. కాంగ్రెస్స్ నా రక్తమని వెల్లడించారు.