దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వందను దాటేసాయి. గడిచిన కొన్ని నెలల్లోనే విపరీతంగా రేట్లు పెంచేసారు. అటు మహమ్మారి ఇబ్బంది పెడుతుంటే ఇటు అధిక ధరలు మరింత చికాకు పెడుతున్నాయి. ఈ రెండింటి నడుమ సామాన్యుడు కుదేలవుతున్నాడు. ఐతే ప్రస్తుతం ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. జులై 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసింది.
సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ నిరసన్లో దేశ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ పాలు పంచుకోనుంది. యువజన కాంగ్రెస్ సహా అన్ని వర్గాలు ఇందులో పాల్గొంటున్నాయి. జిల్లాల వారిగా సైకిల్ ర్యాలీలు, పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు ఇందులో ఉండనున్నాయి. మహమ్మారితో ఇబ్బంది పడుతున్న జనాలకు ధరల బాధలు తప్పించేలా చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.