ఏపీకి మరో షాక్ : కృష్ణా నదిపై మరో ఆనకట్ట..కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

ఏపీతో నీటి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆనకట్ట సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనకట్టతో ఇతర ప్రాజెక్టుల నిర్మాణం సర్వే కోసం అనుమతులు ఇవ్వగా… కృష్ణానదిలో తుంగభద్ర కలిసే ముందు 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద వరద కాల్వ నిర్మాణం చేస్తుండగా… అలంపూర్, గద్వాల ప్రాంతాల్లోని రెండు లక్షల ఎకరాలకు నీటి కోసం సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం.

కల్వకుర్తి ప్రాజెక్టు కింద జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీటి కోసం పులిచింతల వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనుంది. లక్ష ఎకరాల మేర అంతరం ఉన్న ఆయకట్టుకు నీరందించేలా సాగర్ టెయిల్ పాండ్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల కోసం సమగ్ర సర్వే చేపట్టేందుకు తాజాగా అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news