కాంగ్రెస్ కొత్త చిక్కుల్లో పడింది. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు అరెస్టు అయ్యాడు. ఒడిశా – భువనేశ్వర్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో కాంగ్రెస్ విద్యార్థి విభాగం, NSUI అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ అరెస్ట్ అయ్యాడు.

మార్చిలో ఒక హోటల్ గదిలో ప్రధాన్ తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు బాధితురాలు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదిత్ ప్రధాన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. లైంగిక దాడి కేసు నేపథ్యంలో ఉదిత్ ప్రధాన్‌ను సస్పెండ్ చేసింది NSUI.