కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక ప్రకటన

-

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా కేటాయించిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల కేంద్రం చూపిస్తున్న కపట ప్రేమను అందరూ గమనించాలని కోరారు. రాజకీయంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు పనికిరారని విమర్శించారు.

ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. తామేం ఊరుకోమని.. కేంద్రంపై కాంగ్రెస్  తరపున పోరాటం చేస్తామని కీలక ప్రకటన చేశారు. అనవసరమైన వాగుడు వాగడానికే తెలంగాణ బీజేపీ నేతలు పనికొస్తారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ యూనియన్ బడ్జెట్ లా లేదని, బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్ లా ఉందని అన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులవి కోతలు తప్ప చేతలు లేవన్నారు. పన్నుల్లో వచ్చే వాటా తప్ప ప్రత్యేకంగా తెలంగాణకు ఒక్క రూపాయి తేలేకపోయారని విమర్శించారు. కేంద్రం చేసిన మోసంపై కిషన్రెడ్డి బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news