కేజ్రీవాల్‌ చెప్పినట్లుగా BRSకు రూ.75 కోట్లు ఇచ్చా – సుకెష్ చంద్రశేఖర్ సంచలనం

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలమైన కేసు. అనూహ్యంగా ఇప్పుడు పలువురి అరెస్టులతో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి..తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత సన్నిహితులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.

ఈ తరుణంలో కేజ్రీవాల్‌ చెప్పినట్లుగా BRSకు రూ.75 కోట్లు ఇచ్చానంటూ సుకెష్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశారు. కేజ్రీవాల్‌ వాళ్ళతో జరిపిన 700 పేజీల వాట్సప్ చాటు ఉందంటూ ప్రకటన చేశాడు. చాట్ ను త్వరలోనే విడుదల చేస్తానంటూ తెలిపాడు. ప్రస్తుతం త్రిహార్ జైల్ ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ కార్లో ఏపీ అనే వ్యక్తికి 75 కోట్లు అందించినట్లు పేర్కొన్నాడు. 15 కిలోల నెయ్యి అని కోడ్ పెట్టుకున్న సుఖేష్.. హైదరాబాదులోని బిఆర్ఎస్ ఆఫీస్ లో డబ్బులు ఇచ్చినట్లు తెలిపాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news