ఆ కానిస్టేబుల్ కి ఫిదా అయిపోయిన కమీషనర్…!

-

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు… కరోనా దెబ్బకు భయపడుతున్నా వాళ్ళు మాత్రం చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సీపీ అంజనీకుమార్‌ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు.

ఈ సమయ౦లో చెక్‌ పోస్టుల వద్ద, కూడళ్లలో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లు, అధికారులతో ఆయన కాసేపు మాట్లాడారు. వారి బాగోగులను, వారి కుటుంబ విషయాలను నేరుగా ఆయన అడిగి తెలుసుకున్నారు. లిబర్టీ వద్ద విధులు నిర్వహిస్తున్న నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సాయికిషన్‌ తనకు రెండ్రోజుల క్రితం బాబు పుట్టాడని కమీషనర్ కి చెప్పారు. వెంటనే కమీషనర్ షాక్ అయ్యారు.

ఇలాంటి సమయంలో కూడా ఆయన కుటుంబాన్ని వదిలి విధులు నిర్వహించడం చూసి కమీషనర్ ఆశ్చర్యపోయారు. మిఠాయిలు, బిస్కట్లు ఇచ్చి కానిస్టేబుల్ కి శుభాకాంక్షలు చెప్పారు. దీనితో సాయి కిషన్ ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. ఇలా వేలాది మంది పోలీసులు తమ కుటుంబాలను వదిలి విధులు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news