ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.1000 కోట్లతో రాజమండ్రిలో రింగ్ రోడ్డు నిర్మాణం

-

తూర్పు గోదావరి జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా రాజమండ్రి వైసీపీ పార్టీ ఎం.పి. మార్గాని భరత్ రామ్ చెప్పారు. రాజమండ్రి అభివృద్ధి కి కేంద్రం న్యూ ఇయర్ కానుక ఇచ్చిందని.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసిందని వివరించారు.

ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి తనకు ఉత్తర్వులు అందాయని వెల్లడించారు. రాజమండ్రి చుట్టూ 25 నుంచి 30 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మాణం ఏర్పాటు కానుందని తెలిపారు. రాజమండ్రి చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజు అని హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రికి రింగ్ రోడ్ సాధించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో రాజమండ్రి రింగ్ రోడ్ నిర్మాణం కానుందని స్పష్టం చేశారు మార్గాని భరత్. రింగ్ రోడ్డు మంజూరు చేసినందుకు కేంద్రానికి థాంక్స్ చేశారు ఎంపీ భరత్.

Read more RELATED
Recommended to you

Latest news