వివాదంలో”ఊరికి ఉత్తరాన” సినిమా..ఆపేయాలంటూ తెలంగాణ వాదుల డిమాండ్!

-

”ఊరికి ఉత్తరాన” సినిమా వివాదంలో పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని కొందరు తెలంగాణ వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. “ఊరికి ఉత్తరాన” సినిమాలో తెలంగాణ ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని కొందరు తెలంగాణ వాదులు ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణానికి వ్యక్తిని తలకిందులుగా ఉరితీసే సన్నివేశం పై అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చిరించారు. ఇందులో భాగంగానే… గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు తెలంగాణ మేధావులు, తెలంగాణ వాల్మీకి సంఘం నాయకులు. ఆ సన్నివేశం తీసేసే వరకు సినిమా రిలీజ్‌ ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు వనపర్తి వెంకటయ్య వ్యవహరిస్తుండగా… నరేన్‌, దీపాలి హీరో, హీరోయిన్లు ఆ నటిస్తున్నారు. వరంగల్‌ లో జరగిన ఓ యాధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నవంబర్‌ 19 న విడుదల చేయనుంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news