ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదు.. ఇంతకాలం ఎలా తప్పించుకోగలిగింది?

-

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలు కాగానే ప్రపంచ దేశాలతో కుక్ ఐస్‌లాండ్ సంబంధాలను తెంచుకున్నది. సరిహద్దులను మూసివేసింది. రాకపోకలను నిషేధించింది. సుమారు రెండేండ్ల తర్వా మళ్లీ సరిహద్దులను తెరిచింది. దీంతో అక్కడ కూడా తొలి కరోనా కేసు నమోదైంది.

కుక్ ఐస్‌లాండ్‌‌కు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైన రెండేండ్ల తర్వాత శనివారం (డిసెంబర్ 4న) తొలి కొవిడ్-19 కేసు నమోదైంది. దక్షిణ పసిపిక్ సముద్రంలో ఉండే ఈ చిన్న ద్వీప దేశం ఇటీవల టూరిస్టుల కోసం సరిహద్దులను తెరిచింది.

కుక్ ఐస్‌లాండ్ జనాభా 17,000. ఇందులో 96 శాతం మందికి డబుల్ డోసు వ్యాక్సినేషన్‌ కూడా పూర్తి చేసింది. అత్యధిక మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశంగా నిలిచింది.

స్వదేశానికి వెళ్లడం కోసం డిసెంబర్ 2న ఓ కుటుంబం ఏయిర్ పోర్టుకు వచ్చింది. వారిని క్వారంటైన్‌లో ఉంచగా 10ఏండ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. ఆ బాలుడు న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లుగా కుక్ ఐస్‌లాండ్ ప్రధాని మార్క్ బ్రౌన్ అనుమానం వ్యక్తం చేశారు.

దేశ సరిహద్దులను తిరిగి తెరవడానికి ముందే అన్ని రకాల సంసిద్ధమయ్యాం. సరిహద్దులో కొవిడ్-19 కేసును పసిగట్టగలిగామంటే తమ దేశం ఏ స్థాయిలో టెస్టింగ్ నిర్వహిస్తుందో అర్థం చేసుకోవచ్చని బ్రౌన్ పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి మొదలు కాగానే కుక్ ఐస్‌లాండ్ ప్రపంచ దేశాలతో సంబంధాలను తెచ్చుకుంది. ఏ దేశం నుంచి కూడా రాకపోకలను అనుమతి ఇవ్వలేదు. జనవరి 14 నుంచి క్వారంటైన్‌తో నిమిత్తం లేకుండా తమ దేశంలోకి వచ్చే అనుమతి ఇవ్వడానికి ప్రణాళికలు వేసుకున్నది.

ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో వైరస్ వ్యాప్తి చెందడంతో కొద్దికాలంపాటు ప్రయాణాలను నిలిపివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news