కుప్పకూలిన న్యూజిలాండ్ బ్యాటింగ్..62 పరుగులకే న్యూజీలాండ్ ఆల్ అవుట్..

రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ బ్యాటర్లకు ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక్కరంటే ఒక్కరు క్రీజులో నిలుచునే అవకాశం ఇవ్వకుండా వరస వికేట్లు తీశారు, టాప్, మిడిల్, లోయర్ ఆర్డర్లలో ఏ ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగులకు మించి స్కోరు చేయలేదు. 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిల్ కే పెవిలియన్ కు చేరారు. ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ముగ్గరు బ్యాటర్లు డక్ అవుట్ అయ్యారు.

ముంబైలో న్యూజిలాండ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో మహ్మద్ సిరాజ్ ఫేస్ కి, అశ్విన్ స్పిన్ కి న్యూజీలాండ్ బ్యాటర్లు దాసోహం అయ్యారు. 62 పరుగులకే 10 వికేట్లు కోల్పోయి ఆల్ అవుట్ అయింది. మొత్తం వికేట్లలో సిరాజ్3 వికేట్లు అశ్విన్ 4  వికేట్లు తీశారు. అక్షర్ పటేల్2 వికేట్లు, జయంత్ యాదవ్ చెరో వికేట్ తీసి న్యూజీలాండ్ ను కోలుకోలేని దెబ్బతీశారు. దీంతో ఇండియాకు 263 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో న్యూజిలాండ్ ఫాలోఆన్ ఆడే పరిస్థితి ఏర్పడింది.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 325/10 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ సెంచరీ చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో న్యూజీలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రికార్డ్ స్రుష్టించాడు. ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 మంది భారత బ్యాటర్లను ఔట్ చేశాడు.