వ్యాక్సిన్ తీసుకోకుంటే..అక్కడ ఇక నో రేషన్

-

కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూశాక ప్రపంచం మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. ఒకట్రెండు కేసులు వెలుగు చూసిన దేశాల్లో సైతం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం అధికంగా గల దేశాల నుంచి రాకపోకలను నిషేధిస్తున్నాయి ఇంకొన్ని దేశాలు.  ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా.. ఈ కొత్త వేరియంట్ పై అప్రమత్తమైంది.

ఇలాంటి నేపథ్యంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు అధికారులు. పీక తీసుకుంటేనే రేషన్ ఇవ్వాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలను స్థానికంగా అమలు చేస్తూ… రేషన్ షాపుల వద్ద ప్రజలకు టీకాలు వేస్తున్నారు అధికారులు. రేషన్ కోసం తప్పని పరిస్థితిలో ప్రజలు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి రూలు తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయాలని కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నా రు.

Read more RELATED
Recommended to you

Latest news