ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇక శ్రాస్త్రవేత్తలు అందరు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మౌత్‌వాష్‌లు కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తాయంట. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఔననే అంటున్నారు కొందరు పరిశోధకులు.
అయితే కరోనాను నివారించే మందుతోపాటు అసలు వైరస్ సోకకుండా నిరోధించే వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ క్లిష్ట సమయంలో కొంతమంది పరిశోధకులు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు జర్మనీకి చెందిన రూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. వీళ్ళు మౌత్‌వాష్‌లపై పరిశోధనలు చేశారు. ఈ మౌత్‌వాష్ లు కరోనా వైరస్ పై ఎలా పనిచేస్తాయో కల్చర్ టెస్ట్ ద్వారా పరిశీలించారు. అనంతరం ఆ వైరస్ మానవ కణాలపై ఎలా ప్రభావం చూపుతుందో కూడా పరిశోధించారు.
ఇక 229ఇ అనే మానవ కరోనా వైరస్‌పై మౌత్‌వాష్‌ను ప్రయోగించారు. 30 సెకన్ల పాటు ద్రావణాలతో కలిపి ఉంచాక, ఆ వైరస్ క్రియారహితం అయిందని గుర్తించారు. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే ముందు కొన్ని గంటలపాటు గొంతు పైభాగంలోని సైనస్ ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. ఇక వైరస్ అక్కడి నుండి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఇక రోజు మౌత్‌వాష్‌తో గార్గ్‌లింగ్ చేస్తే గొంతు వద్దే వైరస్‌ను నియంత్రించొచ్చనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మౌత్‌వాష్ వైరస్ ని పూర్తిగా అరికట్టలేకపోయినా.. బాగా తగ్గించొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇది వైరస్ నిరోధానికి సరైన పద్ధతిగా మాత్రం భావించొద్దని పేర్కొంటుండటం విశేషం. ఇది కేవలం ల్యాబ్‌లో చేసిన ప్రయోగమే తప్ప మనుషులపై చేసిన క్లినికల్ ట్రయల్స్ కాదని వారు పేర్కొన్నారు. మౌత్‌వాష్‌లో ఉండే క్లోర్‌ఎక్స్‌డిన్ రసాయనానికి వైరస్‌ను క్రియారహితం చేసే శక్తి ఉంటుందని మైక్రోబయోలజిస్టు దుర్గా సునీల్ పేర్కొన్నారు.