తండ్రికి క్యాన్సర్… కుటుంబం మొత్తం ఆత్మహత్య…? కాదు కాదు హత్య…? అసలు మేటర్ ఏంటీ…?

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో ఒక కుటుంబం మొత్తం చనిపోవడం సంచలనంగా మారింది. వారి నివాసంలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు కటుంబ సభ్యులు ఆదివారం చనిపోయినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… అనుప్ బార్మాన్ (33), అతని తల్లి ఉలుబాలా బార్మాన్, భార్య మల్లికా బార్మాన్ మరియు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరూ 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు.. బ్యూటీ బార్మాన్ మరియు స్నిగ్ధా బార్మాన్ చనిపోయారు.

suicidethinkphotos
suicidethinkphotos

ఉదయం 6 గంటలకు వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తపన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమాల్పూర్ గ్రామంలో వారి నివాసంలో చనిపోయి ఉన్నారు. ఇది హత్య కేసా లేక ఆత్మహత్య అనేది పోలీసులు స్పష్టం చేయలేదు. అనుప్ మృతదేహం తన నివాసం పైకప్పుకి వేలాడుతూ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతను క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు అని… చికిత్స కోసం ఖర్చు ఎక్కువగా చేసారు అని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.