కరోనా వైరస్ తీవ్రమవుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మీడియాకు వివరించారు. మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా వచ్చింది అనే మాటల్లో నిజం లేదని. నెగటివ్ వచ్చిందని అన్నారు. తెలంగాణా ప్రజలు అద్రుష్టవంతులు అన్నారు. కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. భారత్ లో కరోనా ప్రభావం లేదని అన్నారు.
రెండు అనుమానిత కేసులు నెగటివ్ వచ్చాయని ఈటెల అన్నారు. తెలంగాణాలో కరోనా రాకూడదు అని కోరుకుంటున్నా అన్నారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం అభినందించింది అన్నారు. అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. త్వరలోనే ఆ దుకాణాలపై దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని మాస్కులు ధరించాల్సిన అవసరం అస్సలు లేదని ఆయన చెప్పారు.
అసలు తెలంగాణా ఉన్న వారు ఎవరికి కరోనా రాలేదని ఆయన అన్నారు. అపోలో లో శానిటేషన్ మహిళకు కరోనా వైరస్ రాలేదని అన్నారు. అదే విధంగా తాము అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎక్కడా కూడా ప్రజల్లో ఆందోళన అవసరం లేదని, ఇక తెలంగాణాలో కరోనా వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేసారు. రిలాక్స్ అయ్యేది లేదు తెలంగాణా అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. రేపటి నుంచి మెడికల్ షాపులపై దాడులు చేస్తామని అన్నారు.