మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణా పురపాలక శాఖా మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ డ్రోన్ ఎగురవేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసారు. నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ ఎగురవేసారని రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసారు.
ఆయనతో పాటుగా ఆయన సోదరుడు కొండల రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 184, 187 కింద కేసులు నమోదు చేసారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన్ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ చట్టం కింద కూడా కేసు నమోదు చేసారు. రేవంత్ సహా 8 మంది పై ఈ కేసులు నమోదు చేసారు పోలీసులు.