ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. అక్కడి నుంచి పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈ నెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు విస్తారంగా వర్షాలు, ఎల్లుండి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.
రేపు, ఎల్లుండీ తెలంగాణ రాయలసీమల్లో చెదురుమదురు భారీ జల్లులతో ఓ మోస్తరునుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయి… సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని… కనుక మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రం లో వేటకు వెళ్ళొదని అధికారులు సూచిస్తున్నారు.