గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు వివరాలు..!

-

కరోనా (corona) మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలతో మనం ఇబ్బందులు పడుతున్నాము. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయి. కానీ డెల్టా వేరియంట్ ఆందోళనకరంగా మారింది. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కరోనా కేసులు గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పటివరకు, దేశంలో 3.07 కోట్లకు పైగా నమోదయ్యాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటి దాక 4,07,145 మరణాలు చోటు చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పటి దాకా 2,99,33,538 మంది కోలుకున్నారు. 4,55,033 యాక్టివ్ COVID-19 ఉన్నాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, జూలై 9 వరకు COVID-19 కొరకు మొత్తం 42,90,41,970 నమూనాలను పరీక్షించారు, శుక్రవారం 19,55,225 నమూనాలను పరీక్షించారు.

కరోనా/corona
కరోనా/corona

గత 24 గంటల్లో 42,766 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. 1200 మందికి పైగా మృతి చెందారు. కేరళలో కొత్తగా 13,563, మహారాష్ట్ర 8,992, తమిళనాడు (3,211), ఆంధ్రప్రదేశ్ (2,982), ఢిల్లీ (93) ఉన్నాయి. అస్సాంలో కొత్తగా 2,644, మణిపూర్ 852 కేసులు నమోదయ్యాయి.

ఇది ఇలా ఉంటే మొత్తం కేసుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర (6,131,976), కేరళ (3025, 466), కర్ణాటక (2,864,868), తమిళనాడు (2,510,059), ఆంధ్రప్రదేశ్ (1,914,213). ఇక వ్యాక్సినేషన్ గురించి చూస్తే… వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందించిన వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య కింద 36.48 కోట్లకు చేరుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news