దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్క రోజే 1,071 కేసులు

-

దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇప్పటికే ఇన్ ఫ్లయెంజా ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ప్రజలపై మళ్లీ కొవిడ్ తన పంజా విసురుతోంది.  తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 129 రోజుల తరువాత ఈ పరిస్థితి ఇదే తొలిసారి.

భారత్ లో మొత్తం మీద 5,915 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అందులో గడచిన 24 గంటల్లో 1,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయని పేర్కొంది.

తాజాగా రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 5,30,802కు చేరింది. ఝార్ఖండ్‌లో రెండు హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా, అయిదు కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మరికొన్ని రోజుల్లో కరోనా మరింత విస్తృతం కానున్న నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాస్కు తప్పనిసరి, కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news