మీ అమ్మాయి భవిష్యత్ కోసం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారా..మీ కోసమే ఎల్ఐసి లో ఈ పథకం ఉంది.. ఆ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎల్ఐసి లో ఉండే అద్భుతమైన ప్లాన్ కన్యాదాన్..ఈ పాలసీ ద్వారా మీరు మీ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే కాకుండా అమ్మాయి చదువు, కెరీర్, పెళ్లి టెన్షన్ నుండి విముక్తి పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్త తల్లిదండ్రులకు తమ కుమార్తె వివాహం కోసం పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చే అవకాశాన్ని కల్పిస్తుంది. LIC అమ్మాయిల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు LIC కన్యాదాన్ పాలసీని అందిస్తోంది. ఈ పథకంలో నెలకు రూ. 3,400 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మెచ్యూరిటీపై రూ. 27 లక్షలు లాభాన్ని పొందవచ్చు..
ఈ పాలసీ తీసుకొనే వ్యక్తికి కనీసం 30 ఏళ్లు ఉండాలి..కుమార్తెకు కనీసం ఒక సంవత్సరం వయస్సు ఉండాలి. మీరు ఈ పాలసీని 13 నుండి 25 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు రోజుకు రూ.121 డిపాజిట్ చేయాలి. అంటే, ఒక నెలలో మీరు మొత్తం రూ. 3,600 డిపాజిట్ చేయాలి. పాలసీ మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, మీరు రూ. 27 లక్షలను పొందవచ్చు. ఇకపోతే రోజుకు రూ. 71 ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్లకు రూ.14 లక్షలను పొందవచ్చు.. 80 సి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..
ఈ పాలసీ తీసుకోవడానికి ముఖ్యమైన పత్రాల విషయానికొస్తే.. ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. దీంతోపాటు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, కుమార్తె జనన ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చెక్ లేదా నగదు ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు..ఇకపోతే పాలసీ దారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సాధారణ పరిస్థితుల్లో మరణిస్తే రూ.5 లక్షలు కుటుంబానికి అందజేయనున్నారు. ఇది కాకుండా 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, నామినీ మొత్తం రూ. 27 లక్షలు పొందుతారు..ఇకపోతే పాలసీదారు వ్యవధి లోపు మరణిస్తే, మెచ్యూరిటీ తేదీకి 1 సంవత్సరం ముందు వరకు ప్రతి సంవత్సరం హామీ మొత్తంలో 10% ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ కింద రైడర్ ఏదైనా వైకల్యం పొందితే కూడా ప్రయోజనం పొందవచ్చు. అయితే ప్రీమియం చెల్లింపు వ్యవధి కనీసం 5 ఏళ్లు చెల్లిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు..