Corona cases : భారత్​పై కరోనా పంజా.. 4వేలు దాటిన కేసులు

-

కరోనా మహమ్మారి గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే గత ఆర్నెళ్లుగా కాస్త శాంతించిన ఈ వైరస్ తాజాగా మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పటికే తన పుట్టిల్లు చైనాలో లక్షల మంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మరోసారి భారత్​ను వణికిస్తోంది.

ఇటీవల భారత్​లో మరోసారి కొత్తకేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో నాలుగు వేలమందికి పైగా కరోనా బారినపడ్డారని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న1,31,086 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కేసులు వచ్చాయి. దాంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.38శాతానికి చేరింది.

గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 23,091(0.05శాతం)కి పెరిగాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,30,916గా ఉంది. ఇప్పటివరకూ 220.6 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత వ్యాప్తిని కట్టడిలో ఉంచేందుకు ఇటీవల ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news