గుడివాడలో బాబు భారీ ప్లాన్..అభ్యర్ధి ఫిక్స్ అవుతారా?

-

ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడలో అడుగుపెడుతున్నారు..చాలా రోజుల తర్వాత బాబు గుడివాడకు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనని విజయవంతం చేసేందుకు టి‌డి‌పి శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ భారీ సభ ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున సభని సక్సెస్ చేసి..గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా టి‌డి‌పి ముందుకెళ్లడానికి సిద్ధమవుతుంది.

అయితే టి‌డి‌పి ఓడిపోయిన తర్వాత బాబు గుడివాడకు రాలేదు. వివిధ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు గాని గుడివాడలో అడుగుపెట్టలేదు. కానీ గతేడాది మినీ మహానాడు గుడివాడలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే వర్షం వల్ల గుడివాడలో మహానాడు కార్యక్రమం రద్దయింది. దీంతో ఆ తర్వాత అక్కడ పార్టీ మీటింగ్ జరగలేదు. మళ్ళీ ఇన్ని రోజులకు బాబు గుడివాడలో అడుగుపెడుతున్నారు. ఈ నెల 12 నుంచి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే 13వ తేదీన గుడివాడలో భారీ సభకు ప్లాన్ చేశారు.

అయితే ఈ సభ గాని సక్సెస్ అయితే టి‌డి‌పి శ్రేణులకు కొత్త ఉత్సాహం వస్తుంది. అదే సమయంలో కొడాలికి చెక్ పెట్టే విధంగా  టి‌డి‌పి శ్రేణులు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ గుడివాడలో ఇప్పటికీ కొడాలి నానిదే పై చేయి అన్నట్లు ఉంది. దానికి కారణం టి‌డి‌పికి సరైన నాయకుడు లేకపోవడం. టి‌డి‌పి ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు గాని..ఆయనకు సీటు ఇస్తారనే గ్యారెంటీ లేదు..ఇంకా పలువురు నేతలు సీటు కోసం ట్రై చేస్తున్నారు.

ఇలా సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉండటంతో టి‌డి‌పికి ఇబ్బందిగా మారింది. దీని వల్ల పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది. అయితే గుడివాడకు వస్తున్న బాబు..సీటు విషయం కూడా తేల్చేస్తే బెటర్. అప్పుడు టి‌డి‌పి శ్రేణులు క్లారిటీతో పనిచేస్తాయి. చూడాలి మరి బాబు గుడివాడ సీటు ఫిక్స్ చేస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news