రికార్డు స్థాయిలో కరోనా కేసులు… వివరాలు ఇవే..!

కరోనా వైరస్ ఇప్పుడు అందర్నీ పట్టిపీడిస్తోంది. ఎక్కడ చూసుకున్నా సరే కరోనా కేసులు విపరీతంగా ఉన్నాయి. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం మంచిది. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం లాంటివి తప్పక పాటించాలి.

కోవిడ్ అందరినీ హడలెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయి లో పెరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా వెలువడ్డ తాజా కేసులు గురించి చూస్తే.. 300,000 పైనే కేసులు వరుసగా ఐదు రోజుల నుండి వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (మోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) డాష్‌ బోర్డ్ ద్వారా ఈ సమాచారం తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశం మొదటిసారిగా 350,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 352,991 కేసులు నమోదవ్వడం తో మొత్తం కేసులు 1,73,13,163 కు చేరుకున్నట్టు డ్యాష్ బోర్డు ద్వారా తెలుస్తోంది. 2812 మంది ఈ వ్యాధితో మరణించడం తో…. మరణాల సంఖ్య 1,95,123 కు చేరుకుంది. ఇలా రికార్డు స్థాయి లో మరణాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది.