కుర్రకారు నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి కారణమా ?

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ లో రోజురోజుకూ టెన్షన్ పెంచుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే కోవిడ్ 19 సెకండ్ వేవ్ లో 100 శాతం కేసుల్లో 43.3 శాతం యువత ఉంటున్నారు. ఈ లెక్కలు చూస్తుంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మాకేం కాదులే అనే నిర్లక్ష్యం యూత్ ను హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడుతోందని అంటున్నారు. యువత తమను కరోనా ఏమీ చేయడం లేదని అనుకుంటూ కరోనా స్పైడర్ గా మారుతున్నారని అంటున్నారు.

వీరి వలనే వృద్దులకు, చిన్నారులకు కరోనా సోకుతుందని అంటున్నారు. ప్రపంచమంతా కరోనాకు భయపడి.. మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేస్తుంటే.. ఇజ్రాయెల్ మాత్రమే ఆ దేశ ప్రజలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇకపై తమ దేశ ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవద్దని ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం. ఆ దేశ ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో బయటకు వెళ్లిన సందర్భంలో మాస్క్ ధరించాల్సిందేనన్న నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్లు ఏప్రిల్ 18న ఇజ్రాయెల్ ప్రకటించింది.