ఫ్యాక్ట్ చెక్: కరోనా వైరస్ మిరియాలు, అల్లం, తేనె తో తగ్గిపోతుందా…? ఇందులో నిజమెంత..?

-

కరోనా వైరస్ తగ్గిపోవాలంటే నల్ల మిరియాలు, అల్లం మరియు తేనె కలుపుకుని తీసుకుంటే తగ్గిపోతుందని సోషల్ మీడియా లో మెసేజ్లు వచ్చాయి. ఈ హోం రెమెడీస్ని పాండిచ్చేరి యూనివర్సిటీ కి చెందిన ఒక స్టూడెంట్ షేర్ చేశారు. అయితే దీనిలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం…!

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా లో ఫేక్ మెసేజ్లు ఎక్కువై పోయాయి. ఎవరికి తోచిన చిట్కాలని వాళ్ళు రాసి వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా తగ్గి పోవడానికి నల్ల మిరియాలు, అల్లం, తేనె కలిపి తీసుకుంటే కరోనా తగ్గిపోతుందని సోషల్ మీడియా లో వచ్చిన మెసేజ్లు ఫేక్ అని తేలింది.

విపరీతంగా ఈ మెసేజెస్ ఫేస్ బుక్, వాట్సప్ మరియు ట్విట్టర్ లో షికార్లు కొట్టాయి. ఇటువంటి మెసేజ్లు షేర్ చేయడం మంచిది కాదు. ఇప్పటికే కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో ఇటువంటి మెసేజ్లు రావడం వలన ప్రజలు తికమక పడతారు.

గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఇటువంటి మెస్సేజెస్ ని గుడ్డిగా నమ్మొద్దు అని అఫీషియల్గా విడుదలయిన వాటి మీదే నమ్మకం ఉంచి, అనుసరించాలని చెప్పింది. అదే విధంగా ఇటువంటి వాటికీ షేర్ చెయ్యదు. దీని వలన ఇతరులు కూడా ఇబ్బంది పడతారు.

Read more RELATED
Recommended to you

Latest news