దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు..

-

భారత్ లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10 లక్షల 89 వేల 403 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా….61 వేల 267 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది. 884 మంది వైరస్ కారణంగా చనిపోయారని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 66 లక్షల 85 వేల 83 గా ఉందని ప్రకటించింది.

అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9 లక్షల 19 వేల 23 ఉన్నాయి. కరోనా వైరస్ చికిత్స పొంది డిశ్చాజ్ అయిన వారు 56 లక్షల 62 వేల 491 మంది ఉన్నట్టు బులిటెన్ లో తెలిపింది కేంద్రం. ఇక వైరస్ బారిన పడిఇ ప్పటి వరకు చనిపోయిన వారు లక్షా 3 వేల 569 మంది ఉండగా….దేశంలో బాధితుల రికవరీ రేటు 84.70 గా ఉన్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 13.75 గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల 10 లక్షల 71 వేల 797 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news