దేశంలో కరోనా కేసుల తీవ్రత తక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా.. దేశంలో కరోన కేసులు రోజుకు 10 వేల లోపే నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకోవడంతో ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడంతో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంటుంది.
తాజాగా దేశంలో 24 గంటల్లో 8603 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 415 మరణాలు సంభవించాయి. 8190 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 99974 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. ఇదే విధంగా యాక్టివ్ కేసుల శాతం 0.29గా, మరణాల శాతం 1.36 గా ఉంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా మరణాల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య, రికవరీల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది.
దేశంలో కరోనా వివరాలు–
మొత్తం కరోనా కేసులు– 3,46,24,360
మరణాలు– 4,70,530
రికవరీ– 3,40,53,856
యాక్టివ్ కేసులు– 99,974
వ్యాక్సినేషన్ డోసులు- 126,53,44,975