రేపు మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

-

రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో మాజీ ముఖ్య‌మంత్రి రోశయ్య అంత్య క్రియలు నిర్వ‌హించ‌నున్నారు. కాసేపట్లో ఆస్ప‌త్రి నుంచి రోశయ్య పార్థివ దేహాన్ని ఆయ‌న‌ ఇంటికి తీసుకెళ్ల‌నున్నారు. రేపు 11 గంటల తరువాత గాంధీ భవన్ కు రోశయ్య పార్థివ దేహన్ని త‌ర‌లించనున్నారు. గాంధీ భవన్ లో అభిమానుల కడసారి చూపుకోసం ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జ‌రుగ‌నున్నారు. రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి.

కాగా ఇవాళ ఉద‌యం మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మ‌ర‌ణించారు. 88 సంవ‌త్స‌రాలు ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌… ఆరోగ్యం విష‌మించి… తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉద‌యం ఒక్క సారి గా బీపీ డౌన్ కావడం తో రోశ‌య్య‌ను ఆస్పత్రికి తరలించారు. హైద‌రాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి రోశ‌య్య‌ను తరలించారు కుటుంబ సభ్యులు. అయితే…. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news