కరోనా ఎఫెక్ట్‌.. తీవ్ర‌మైన న‌ష్టాల్లో టాటూ ఇండ‌స్ట్రీ..

-

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల దేశంలో అనేక రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. పెద్ద మొత్తంలో న‌ష్టం వ‌చ్చింది. అయితే అన్‌లాక్ ప్ర‌క్రియ ఆరంభంతో నెమ్మ‌దిగా మ‌ళ్లీ ఒక్కో రంగం త‌మ న‌ష్టాల‌ను పూడ్చుకునే ప‌నిలో ప‌డ్డాయి. కానీ టాటూ ఇండ‌స్ట్రీ మాత్రం ఇంకా తీవ్ర‌మైన న‌ష్టాల‌నే చ‌వి చూస్తోంది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌లో ఒక‌ప్పుడు టాటూల‌కు క్రేజ్ ఉండేది. కానీ కరోనా భ‌యం వ‌ల్ల ప్ర‌స్తుతం టాటూల‌ను వేయించుకునే వారు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయారు. దీంతో ఆ రంగానికి చెందిన వారు తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

corona effect heavy losses for tattoo industry

టాటూల‌ను వేయ‌డం అనే ప్రక్రియ‌లో కచ్చితంగా వ్య‌క్తుల శ‌రీరాల‌ను ట‌చ్ చేయాల్సి ఉంటుంది. ఇక టాటూ సైజ్‌ను బ‌ట్టి అది వేసే టైం కూడా పెరుగుతుంది. ఈ క్ర‌మంలో అంత సేపు బాడీల‌ను ట‌చ్ చేస్తూ టాటూల‌ను వేయ‌డం, వేయించుకోవ‌డం.. అంటే రిస్కుతో కూడుకున్న వ్య‌వ‌హారం. అందువ‌ల్లే చాలా మంది ప్ర‌స్తుతం టాటూల‌ను వేయించుకోవాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. టాటూ పార్ల‌ర్లు, స్టూడియోల వైపు చూడ‌డం లేదు. దీంతో ఆ రంగానికి చెందిన వారు ఇంకా న‌ష్టాల్లోనే ఉన్నారు.

ఎంత చిన్న సైజ్ టాటూ వేయాల‌న్నా క‌నీసం 30 నిమిషాల నుంచి 1 గంట వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. దీని వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువల్లే మా వ‌ద్ద‌కు క‌స్ట‌మ‌ర్లు రావ‌డం లేదు… అని ఢిల్లీకి చెందిన ఓ టాటూ ఆర్టిస్టు వాపోయారు.

అయితే క‌రోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గితేనే కానీ త‌మ‌లాంటి ఇండ‌స్ట్రీల‌కు చెందిన వారు కోలుకోలేర‌ని టాటూ ఆర్టిస్టులు చెబుతున్నారు. అప్ప‌టి వ‌ర‌కు న‌ష్టాల‌ను భ‌రించాల్సి ఉంటుంద‌ని వారు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news