ఇండియా ఆస్ట్రేలియా మొదటి టెస్టుపై కరోనా ప్రభావం..!

-

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు వన్డేలు మూడు టి20, 4 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఇప్పటికీ ఐపీఎల్ ముగించుకొని ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు అక్కడ కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉంటూ ప్రాక్టీస్ కూడా మెల్లిమెల్లిగా మొదలుపెడుతుంది భారత జట్టు. ఇక మరికొన్ని రోజుల్లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మొదటి టెస్టుపై కరోనా ఎఫెక్ట్ పడబోతుంది అన్న అనుమానాలు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయి. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోన్న ఈ క్రమంలోనే ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు వైద్యుల సూచనల మేరకు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. ఆటగాళ్లు అందరికీ ఎప్పటికప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో మొదటి టెస్టుపై కరోనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తాము అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news