కరోనా కారణంగా వ్యాపారాలన్నీ ఆగిపోయాయి. ఉపాధి లేక కూలీలకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. ఒక్కసారిగా అనుకోకుండా వచ్చిన ఉపద్రవం అన్నింటినీ తారుమారు చేసింది. కరోనా కారణంగా ఇప్పటికీ నష్టపోతున్న వాటిల్లో సినిమా థియేటర్లు కూడా ఒకటి. అన్ లాక్ లో భాగంగా అన్నింటికీ అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం సినిమా థియేటర్లకి రిస్ట్రిక్షన్స్ పెట్టింది.
దాంతో ఆ నియమ నిబంధనల మధ్య థియేటర్లని నడపలేక సినిమా హాళ్ళని మూసేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరంలోని నారాయణ గూడలో శాంతి థియేటర్ ని పూర్తిగా మూసేసారట. వ్యాపార కలపాల కోసం గోడౌన్లుగా మార్చేస్తున్నారట. శాంతి థియేటరే కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని శ్రీ మయూరి, మెహదీ పట్నంలోన్ని అంబ థియేటర్లు కూడా వ్యాపారాల నిమిత్తం గోడౌన్లుగా మారిపోయాయట.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.